Manchu Vishnu : మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-31 05:34:12.0  )
Manchu Vishnu : మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అతని కుమారులు మంచు విష్ణు, మనోజ్ లు ఇటీవల కుటుంబ అంతర్గత కలహాలతో రోడ్డున పడిన వ్యవహరం మరువకముందే మంచు విష్ణు సిబ్బంది (Manchu Vishnu Staff) మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్ పల్లి లోని గరిగుట్ట అడవి (Garigutta Forest in Jalpalli) లో అడవి పందులను విష్ణు సిబ్బంది(Hunted Wild Boars) వేటాడారు. మోహన్ బాబు కుటుంబం జల్ పల్లిలోని నివాసంకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడారు. ఆ సమయంలో మోహన్ బాబు, విష్ణులు నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది. సిబ్బంది అడవి పందులను బంధించి తీసుకెలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వన్యప్రాణులు..జంతు సంరక్ష కార్యకర్తలు దీనిపై మండిపడుతున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విష్ణు సిబ్బంది చర్య వన్యప్రాణుల చట్ట ఉల్లంఘనే అని ఆరోపిస్తున్నారు. తక్షణమే దీనిపై సంబంధిత శాఖలు విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవేంద్రప్రసాద్ పై ఇప్పటికే ఈ తరహా ఆరోపణలు గతంలోనూ ఉన్నాయని, మంచు మనోజ్ హెచ్చరించినా వారిద్దరు వినకుండా అడవి పందులను వేటాడినట్లుగా మనోజ్ వెల్లడించినట్లుగా సమాచారం.

ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవల నేపధ్యంలో మంచు విష్ణు సైతం పోలీసులకు బైండోవర్ ఇచ్చారు. ఇక జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ నోటీసులు అందుకున్న మోహన్ బాబు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు విషయంలో చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని ఇప్పటికే రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed