Harish Rao : ఆర్పీల పెండింగ్ వేతనాలు ఇవ్వండి : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : ఆర్పీల పెండింగ్ వేతనాలు ఇవ్వండి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న 6000 మంది ఆర్పీల(Resource Persons)కు ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పట్టించుకోకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 6000 మంది ఆర్పీలకు ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.

పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలోనైనా ఆర్పీల పెండింగ్ జీతాలను చెల్లించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed