Fire Accident: బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం?

by Shiva |   ( Updated:2025-01-01 09:26:25.0  )
Fire Accident: బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం?
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని బాలాపూర్‌ (Balapur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున ఓ ప్లాస్టిక్ గోడౌన్‌ (Plastic Godown)‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే గౌడౌన్‌లో ఎగసిపడుతోన్న మంటలను చూసిన స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, రాత్రి వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed