- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా పై అదిరిపోయే కామెంట్స్ చేసిన నిర్మాత.. వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతుందని లాస్ట్ ఇయర్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నాగ వంశీ.. బన్నీతో త్రివిక్రమ్ తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్‌లో ఈ మూవీ ఉండబోతుందని, దేశంలో ఎవ్వరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో మరోసారి నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
“పుష్ప-2తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. అందుకు సరిపోయేలా ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్‌లోనే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియోను నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జేట్‌తో వచ్చే ఈ సినిమాలో వీఎప్‌ఎక్స్ పార్ట్ చాలా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇది పాన్ ఇండియా మొదటి సినిమా. అందుకే త్రివిక్రమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రెడీ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది.