Sreeleela: బాలీవుడ్ స్టార్ హీరో సరసన చాన్స్ కొట్టేసిన టాలీవుడ్ కుర్ర హీరోయిన్?

by Anjali |
Sreeleela: బాలీవుడ్ స్టార్ హీరో సరసన చాన్స్ కొట్టేసిన టాలీవుడ్ కుర్ర హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో కానీ.. ప్రారంభంలోనే సీనియర్ అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. ఏకంగా బాలకృష్ణ(Balakrishna), మాస్ మహారాజా(Mass Maharaja) వంటి ప్రముఖ హీరోలతో నటించింది. తన అందం, అభినయం.. ముఖ్యంగా అదిరిపోయే స్టెప్పులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసిందనడంలో అతిశయోక్తిలేదు. రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ఫ-2’ (Puṣpha)లో ఐటెమ్ సాంగ్ కు గ్లామర్ స్టెప్పులేసి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రజెంట్ ఈ హీరోయిన్ చేతిలో నాలుగు మూవీస్ ఉన్నప్పటికీ దర్శక, నిర్మాతలు ఈ బ్యూటీకి చాన్స్‌లు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. శ్రీలీల బాలీవుడ్ ప్రముఖ హీరో కార్తీక్ ఆర్యన్(Bollywood famous hero Karthik Aryan) తో జతకట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ కుర్ర హీరోయిన్ తమిళ్ హీరో శివ కార్తికేయన్(Tamil hero Siva Karthikeyan) తో కూడా నటించనుందన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed