- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇది తాగితే ఆరోగ్యం మటాష్
దిశ, డైనమిక్ బ్యూరో: కల్తీ సారా సేవించి పెద్ద సంఖ్యలో తమిళనాడులో ప్రజలు మరణించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ లో కల్తీ వైన్ తయారీ కలకలం రేపుతోంది. కల్తీ మద్యం తయారు చేస్తున్న లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఓ మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 112 బాటిళ్లలో నింపిన 90 లీటర్ల వైన్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా సదరు మహిళ ఆర్డర్లపై కల్తీ మద్యం సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఆమె కల్తీ వైన్ తయారు చేస్తూ పట్టుబడినట్లు తెలుస్తోంది.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం:
కాగా మద్యం ప్రియుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కల్తీరాయుళ్లు ఇలాంటి నకిలీ మద్యం తయారీకి తెగబడుతున్నట్లు తెలుస్తున్నది. వీరు తయారు చేస్తున్న కల్తీ వైన్ ను బ్రాండెడ్ స్టిక్కర్లు కలిగిన మద్యం బాటిల్స్ లో నింపి అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అమాయకుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.