- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మే 1 నుంచి షిర్డీ బంద్.. కారణమిదే..!
దిశ, వెబ్‌డెస్క్: మే 1 నుంచి షిర్డీ బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్ కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
అయితే సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్ట్ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజా నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. సాయి సంస్థాన్ సిబ్బంది, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు. ప్రతి రోజూ బాంబు స్క్వాడ్ ఆలయాన్ని తనిఖీ చేస్తున్నారు.
సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా ఔరంగాబాద్ కోర్టు షిర్డీ సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సాయిసంస్థాన్ సీఐఎస్ఎఫ్ తో భద్రతకు మద్దతు పలికింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ షిర్డీ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం భేటి అయిన గ్రామస్తులు సమావేశమై మహారాష్ట్ర దినోత్సవం మే 1 వ తేదీ నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. అయితే గ్రామస్తులు సమ్మె చేసినా సాయిబాబా టెంపుల్ ని భక్తుల కోసం తెరిచి ఉంచుతామని సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది.
Also Read..