ఖమ్మం సభకి వెళ్ళాలా.. ? వద్దా? డైలమాలో పొంగులేటి అభిమానులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-17 05:32:32.0  )
ఖమ్మం సభకి వెళ్ళాలా.. ? వద్దా? డైలమాలో పొంగులేటి అభిమానులు
X

దిశ, చర్ల : ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభకి వెళ్ళాలా లేక డుమ్మా కొట్టాలా అని పొంగులేటి అభిమానులు మీమాంసలో పడ్డారు. పొంగులేటి పార్టీ మారడం ఖాయమని తేలడంతో కార్యకర్తల్లో సందిగ్ధం నెలకొంది. అదే క్రమంలో పొంగులేటిని ఒంటరిని చేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ నాయకత్వం షురూ చేసింది. పొంగులేటి వెంట వెళ్ళేవారిని కట్టడిచేసే పనిలో నాయకులు తలమునకలయ్యారు. పార్టీ మార్పుపై పొంగులేటి నోటి వెంట ఇంకా ప్రకటన వెలువడకపోవడంతో ఖమ్మం సభకి వెళ్ళాలా వద్దా అనే విషయాన్ని కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు.

పొంగులేటి అభిమానులు ఖచ్చితంగా మీటింగ్‌కి హాజరయ్యేలా బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మీటింగ్‌కి జనాన్ని తరలించే బాధ్యత పొంగులేటి వర్గీయులకే అప్పగిస్తుండటం గమనార్హం. పొంగులేటి వెంట లీడర్లు లేరనే అభిప్రాయం జనంలో కలిగించేలా బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పొంగులేటి వర్గీయులు మీటింగ్‌కి వెళతారా లేక గైర్హాజరు అవుతారా అనేది ఇపుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed