- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE-Advanced-2025: ఐఐటీల్లో చదువుకోవాలనుకునే వారికి బిగ్ షాక్.. జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షపై యూ టర్న్..!
దిశ, వెబ్డెస్క్: దేశంలోని ప్రతి ష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IIT), ఎన్ఐటీ(NIT)ల్లో బీటెక్(B.Tech) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్డ్(JEE-Advanced) పరీక్షను 2025 నుంచి మూడేళ్లు రాసుకోవచ్చని ఇటీవలే జాయింట్ అడ్మిషన్ బోర్డు(JAB) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయంపై జేఏబీ యూ టర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే వరుసగా రెండు సార్లు మాత్రమే అనుమతి ఉంటుందని జేఏబీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జేఈఈ-అడ్వాన్స్డ్-2025 పరీక్ష నిర్వహణ బాధ్యతను తీసుకున్న ఐఐటీ కాన్పూర్(IIT Kanpur) వెల్లడించింది. కాగా ఈ పరీక్షను వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే ఛాన్స్ ఉండగా దాన్ని మూడు సంవత్సరాలకు పెంచుతూ ఐఐటీ కాన్పూర్ ఈ నెల 5న ప్రకటించింది. 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే ఈ పరీక్షకు 2024 మార్చి లేదా 2025 మార్చిలో ఇంటర్ పాసైన వారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులైన వారికీ ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు.