- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందరి పోరాటల వల్లే.. ప్రభుత్వం వచ్చింది
దిశ బొంరాస్ పేట్ :- గత బిఆర్ఎస్ ప్రభుత్వం,ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై, అందరి పోరాటల వల్లే ఈ ప్రభుత్వం వచ్చిందని పిఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య అన్నారు. మంగళవారం దుద్యాల మండలంలోని రోటిబండా,లగచర్ల గ్రామాలకు వెళ్తున్న బృందాన్ని తుంకిమెట్ల కూడలిలో పోలీసులు అడ్డగించారు.ఆయా గ్రామాల్లో పరిస్థితులు బాగాలేకనే, ఆయా గ్రామాల మహిళలు మాకు సమాచారం ఇవ్వడంతో మేము వచ్చామని చెప్పినా పోలీసు అడ్డగించడం ఏమిటని ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలలో బిఆరెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మేం పోరాటం, ధర్నాలు చేశామన్నారు. ఈ ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీలతో పాటు, ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలు వద్దన్నా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం ఏమిటని, బలవంతంగా భూములను తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
భూ బాధితులకు అండగా ఉందామని మేము వెళుతుంటే అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు.ఇది ప్రజా ప్రభుత్వమా,పోలీస్ రాజ్యమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఖరి ఇదేనా అని ప్రశ్నించారు. ఈ నిర్బంధాలు ఎన్ని రోజులు కొనసాగిస్తారు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయాని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నారు. వీరిని పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై రావుఫ్ సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఝాన్సీ,గీత,పద్మజ షా,సిస్టర్ లీజీ, తదితరులు పాల్గొన్నారు.