పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. జర్నీలో ఇబ్బందులుండవు

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-19 10:43:30.0  )
పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.. జర్నీలో ఇబ్బందులుండవు
X

దిశ, ఫీచర్స్: చిన్న పిల్లలతో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్లతో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా 4 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లకి కావలసిన వస్తువులన్నింటిని ప్యాక్ చేయాలి. పిల్లలతో ప్రయాణం చేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలతో ట్రావెల్ చేయాలనుకునే వారు, పిల్లలకి అవసరమైన వస్తువులను తప్పనిసరిగా ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేయాలి. అందులో ముఖ్యంగా డైపర్, వైప్స్ ప్యాక్, మిల్క్, బేబీ ఫుడ్, బేబి మాశ్చరైజర్ క్రీమ్ వంటివి తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి. పిల్లలు తినే ఆహార పదార్థాలు, స్నాక్స్ వంటివి ముందుగా ప్యాక్ చేసుకోవాలి. బాటిల్స్, ఎక్స్‌ట్రా డ్రెస్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీరు కార్‌లో ప్రయాణం చేయాలనుకుంటే.. పిల్లలకి ప్రత్యేకంగా కారు సీట్స్ ఉంటాయి. వాటిని ప్రిఫర్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు కంఫర్టబుల్‌గా కూర్చుకోవడానికి వీలుంటుంది. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకెళ్లాలి. వాటర్ బాటిల్‌ను కూడా తీసుకెళ్లడం మంచిది. బయట దొరికే నీరు ఇవ్వకుండా ఇంట్లోనే హాట్ వాటర్‌ క్యారీ చేయండి.

జర్నీలో ఎంటర్టైన్ చేయడం కోసం కొన్ని బొమ్మలు, కార్టూన్ పుస్తకాలు, పజిల్స్ వంటి వాటిని తీసుకెళ్లండి. ముందుగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్లకి జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నట్లైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ల బాడీ టెంపరేచర్‌ని చెక్ చేస్తూ ఉండాలి. ట్రావెల్ చేయడానికి ముందే అక్కడి వాతావరణం, హోటల్స్, రూమ్స్‌పై అవగాహన ఉండాలి. సాధ్యమైనంత వరకు బేబి ఫ్రెండ్లీ హోటళ్లను ఎంచుకోండి. కార్‌లో ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు కొంత సమయం బ్రేక్ తీసుకుంటూ జర్నీ చేయడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed