- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆజంపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల జిల్లాకు రోల్ మోడల్ గా నిలవాలి : కలెక్టర్
దిశ, కాచిగూడ : నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు, సమాజ నిర్మాతలు అని, యువత శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా, ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలోని ఆజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల టాయిలెట్ లో నాప్కిన్ దహన యంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రుతుక్రమం ప్రకృతి పరమైన చర్య అని దాని గురించి అపోహ, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు విడనాడాలని అన్నారు. నేటి బాలలే భావి భారత పౌరులని, భవిష్యత్ నిర్మాతలని అన్నారు. యువత శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా అజాంపూర ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్ లో బాలికల కోసం ఇన్సినరేటర్ (నాప్కిన్ దహన యంత్రం) సురక్షితమైన రుతుస్రావం కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ యంత్రమును బాలికలు ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.
ఏమైనా మరమ్మతులు వస్తే వెంటనే తెలియజేసి బాగు చేయించాలన్నారు. ఆజంపుర పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 384 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో హెల్త్ క్లబ్ ఏర్పాటు కు ఈ పాఠశాల రోల్ మోడల్ గా నిలవాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. మనం మంచిగా ఉండి పదిమందికి ఆదర్శంగా నిలవాలి అన్నారు. టిఎస్ ఐ సి, అల్టిమేట్రిక్, యంగిస్తాన్ ఫౌండేషన్ ఆదర్శంగా ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం ఇన్సినిరేటర్ లను ఏర్పాటు కు కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని హెల్త్ క్లబ్ అంబాసిడర్ లకు శాలువా కప్పి కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ఆర్.రోహిణి, ప్రత్యేక అధికారి జిఎం ఇండస్ట్రీస్ పవన్ కుమార్, డిప్యూటీ ఐఓఎస్ నిజాముద్దీన్, డిప్యూటీ ఈవో విజయ, ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, యంగిస్తాన్ ఫౌండేషన్ అరుణ్ ఎలమటి, టిసిఐసి కృతిక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు