Blind World T20 World Cup : పాక్ వేదికగా టీ20 వరల్డ్ కప్.. టీంఇండియా వెళ్తుందా?

by M.Rajitha |
Blind World T20 World Cup : పాక్ వేదికగా టీ20 వరల్డ్ కప్.. టీంఇండియా వెళ్తుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్(Pakisthan) వేదికగా ఈ నెల 23 నుంచి అంధుల టీ20 వరల్డ్ కప్ (Blind World T20 World Cup) జరగనుంది. అయితే ఈ టోర్నీకి భారత(India) జట్టు మాత్రం వెళ్లబోవటం లేదు. పాకిస్థాన్లో ఆడేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్ తెలిపినప్పటికీ.. భారత విదేశాంగ శాఖ మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ వెల్లడించారు. కాగ్ వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. పాక్ లో తమ జట్టు ఆడబోదని బీసీసీఐ(BCCI) ఇటు ఐసీసీ(ICC)కి అటు పాక్ క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనాలి అంటే టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించి.. భారత్ మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో అంధుల ప్రపంచ కప్ లో ఆడటానికి విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story