Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..?

by Anjali |
Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమందికి మొక్కల్ని(Plants) నాటడం అంటే చాలా ఇష్టం. అయితే మొక్కలు పెంచడం ద్వారా మీరు అద్భుతమైన లాభాలు(Profits) పొందొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ బిజినెస్‌(Business)తో మంచి లాభాలు పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది తక్కువ టైంలో అధిక లాభాల్ని ఆశిస్తున్నారు. అందుకు ఈ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు కూడా అలాంటి బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం.. ఇటు ఆరోగ్యపరంగానూ.. అటు డబ్బు పరంగా మేలు జరుగుతుంది.

ఇక బోన్సాయ్ చెట్టు(Bonsai tree) అందరికీ తెలిసిందే. ఈ చెట్ల వ్యాపారంతో మనీ పెద్ద మొత్తంలో కూడబెట్టొచ్చు. ఇందుకు మీకు భారత ప్రభుత్వం(Government of India) కూడా ఫైనాన్షియల్‌గా హెల్ప్(Financial help) చేస్తుంది. కాకపోతే ఈ చెట్లపెంపకం విషయంలో బాగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ చెట్లు మీ ఇంటి ఆవరణంలో పెంచితే.. ఇంటి చుట్టూ వాతావరణం(weather) చల్లగా ఉంటుంది. కాగా ఎక్కడికో వెళ్లి కష్టపడి ఈ చెట్లను పెంచాల్సిన అక్కర్లేదు.

ఇంటి దగ్గరున్న ప్లేస్‌లో ఈ మొక్కల్ని నాటుకోవచ్చు. కాకపోతే ఈ బోన్సాయ్ చెట్లు సిద్ధమవ్వడానికి దాదాపు రెండు, మూడేళ్లైనా పడుతుంది. మొదట్లో రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు పెట్టుబడి పెడితే చాలు. తర్వాత క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఈ మొక్కలు నర్సీల(Nurses)లో దొరుకుతాయి. ఇవి నాటాక.. పెరిగిన తర్వాత మార్కెట్‌(market)లో అమ్మితే మంచి లాభం చేకూరుతుంది.

ప్రస్తుతం బోన్సాయ్ చెట్టు(Bonsai tree) ధర మార్కెట్‌లో రూ. 20 నుంచి రూ. 2 వేల వరకు పలుకుతోంది. కొన్ని రకాలైతే ఏకంగా 10, 000 వేల వరకు ఉన్నాయి. భారీ డిమాండ్ ఉన్న ఈ మొక్కలు ఇళ్లను అలంకరించడానికి, ఫంక్షన్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Advertisement

Next Story