- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PSBs: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను విక్రయించే యోచనలో ప్రభుత్వం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లలో వాటాను తగ్గించుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరికొద్ది నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 96.4 శాతం, యూకో బ్యాంక్‌లో 95.4 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 98.3 శాతం వాటా ఉంది. ఓపెన్ మార్కెట్‌లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు 25 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే 2026, ఆగస్టు వరకు ఈ నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను మినహాయింపు ఉంది. దీనికి సంబంధించ్ అధికారికంగా వివరాలు బహిర్గతం కాలేదు.