- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kashmir Valley: కశ్మీర్ లోయలో తొలి రైలు సేవలు

దిశ, నేషనల్ బ్యూరో: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, కశ్మీర్ లోయలో తొలి రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న కత్రా నుంచి శ్రీనగర్‌కు వెళ్లే తొలి రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. అంతేకాకుండా కశ్మీర్ లోయలో ప్రయాణించే తొలి ట్రైన్ ప్రత్యేక వందే భారత్ రైలేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత ఈ రైలు కత్రా నుంచి శ్రీనగర్/బారాముల్లా మధ్య నడిచే అవకాశం ఉంది. ఆగస్ట్ నుంచి జమ్మూ రైల్వే స్టేషన్‌లో విస్తరణ పనులు పూర్తయిన తర్వాత, జమ్మూ నుంచి శ్రీనగర్/బారాముల్లా వరకు నడపాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు నేరుగా రైలు సర్వీసు లేదు. దీంతో పాటు, ప్రధాని మోడీ అదే రోజున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెనను కూడా సందర్శిస్తారని, కత్రాలో జరగబోయే బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తారని సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇతర రాజకీయ ప్రముఖులు, అధికారులు కూడా హాజరుకానున్నారు. ఇటీవలే చీనాబ్ వంతెనపై వందే భారత్ రైలు ప్రయాణించింది. పూర్తీగా అత్యంత శీతల వాతావరణాన్ని కూడా తట్టుకునేలా రూపొందించిన ఈ రైలులో హీటింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సెమీ హైస్పీఎడ్ వందే భారత్ కత్రాలోని శ్రీమాతా వైష్ణోదేవీ నుంచి శ్రీనగర్‌ను ప్రయాణించింది.