CAG Report: తెలంగాణ అప్పులపై కాగ్ షాకింగ్ రిపోర్ట్

by Prasad Jukanti |   ( Updated:2025-03-27 07:30:20.0  )
CAG Report: తెలంగాణ అప్పులపై కాగ్ షాకింగ్ రిపోర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చు అయిందని అదనంగా రూ. 1,11,477 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని కాగ్ నివేదిక (CAG Report) స్పష్టం చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున (గురువారం) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాస్స్ అకౌంట్స్, అప్రొప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ సమర్పించిన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2023-24 ముగిసే వరకు తెలంగాణ రాష్ట్ర రుణాల మొత్తం 4,03,664 కోట్లు అని వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ. 2 లక్షల 20 వేల కోట్లు అని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2022-24 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.53,144 కోట్ల అప్పు తీసుకున్నదని 2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ.49,618 కోట్ల అప్పులు తెచ్చినట్లు తెలిపింది. గత ఏడాది కాలంలో 200 శాతం ఎఫ్ఆర్ బీఎస్ పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్ స్పష్టం చేసింది. 2023-24 లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ రూ.779 కోట్లుగా పేర్కొంది. 2023-24 బడ్జెట్ అంచనా రూ. 2,77, 690 కోట్లు కాగా చేసిన వ్యయం రూ. 2,19,307 కోట్లు అని బడ్జెట్ అంచనాల్లో 79 శాతం వ్యయం అయిందని కాగ్ నివేదిక పేర్కొంది. జీఎస్డీపీ (GSDP) వ్యయం అంచనా 15 శాతం వచ్చిందని స్పష్టం చేసింది. 2023-24 లో కేంద్రం నుంచి మొత్తం రూ. 9,934 కోట్లు గ్రాంట్లు వచ్చినట్లు తెలిపింది.

ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచే 61.83% రాబడి..

రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే ఖర్చు అయినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. రెవెన్యూ మిగులు రూ. 779 కోట్లు, రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.33 శాతం అని తెలిపింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా రూ. 10,156 కోట్లు ప్రభుత్వం తీసుకున్నదని రూ. 35,425 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్‌ను 145 రోజుల పాటు వాడుకుందని తెలిపింది. 2023-24 లో వడ్డీల చెల్లింపుల కోసం రూ 24,347 కోట్ల వ్యయం చేయగా, వేతనాలకు రూ. 26,981 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు కాగా జీఎస్డీపీలో అప్పులు 27 శాతం అని వివరించింది. 2023-24 వరకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ.2,20,607 కోట్లు, మూలధనం కింద చేసిన ఖర్చు రూ.43,918 కోట్లు అని తెలిపింది. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు వచ్చినట్లు వెల్లడించింది.

11 శాతం పెరిగిన ప్రభుత్వ నిధులు..

ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని 2023-24లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.76,773 కోట్లు అని కాగ్ తెలిపింది. స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 11 శాతం పెరుగుదల ఉందని వెల్లడించింది. 349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని ప్రభుత్వం వినియోగించుకున్నట్టు కాగ్ నివేదిక పేర్కొన్నది.

Next Story

Most Viewed