జ్యూస్ బండి వాడికి రూ. 7.79 కోట్ల ఆదాయపు పన్ను నోటీసులు !

by Veldandi saikiran |
జ్యూస్ బండి వాడికి రూ. 7.79 కోట్ల ఆదాయపు పన్ను నోటీసులు !
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యూస్ బండి వాడికి 7.79 కోట్ల ఆదాయ పన్ను నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆ జ్యూస్ వ్యాపారస్తుడి ( Juice Seller ) కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి 7.79 కోట్ల ఆదాయ పన్ను నోటీసులు రావడం ఏంటని... షాక్ అయింది ఆ ఫ్యామిలీ. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ( UP ) రాష్ట్రంలోని ఆలీఘర్ జిల్లాలో ( Aligarh ) చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ కు చెందిన మొహమ్మద్ రయీస్‌ జ్యూస్ బండి పెట్టుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తాజాగా అతనికి.. ఇన్కమ్ టాక్స్ నోటీసులు ( Income Tax Notice) జారీ అయ్యాయి.

అది కూడా 7.79 కోట్ల టర్నోవర్ కు... ఆదాయపు పన్ను నోటీసు వచ్చింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే దీనికి కారణం...మొహమ్మద్ రయీస్‌ ( Mohammad Raees ) పాన్ కార్డ్. అతని పాన్ కార్డుతో... ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. ఏకంగా 7.79 కోట్ల విలువైన లావైదేవిలు జరిగాయి. మొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో... మొహమ్మద్ రయీస్‌ పాన్ కార్డు దుర్వినియోగం... జరిగినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు జరిగిన సంఘటనకు ఈ తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దీపక్ శర్మ అనే వ్యక్తి కీలక ముద్దాయిని సమాచారం. అతని కోసం గాలింపు కూడా చేస్తున్నారు అధికారులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed