- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GSAT-20: జీశాట్ 20 ప్రయోగం సక్సెస్.. కక్షలో వదిలిపెట్టిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్
దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష సంస్థ (ISRO) రూపొందించిన అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 (Gsat 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎలన్ మస్క్(Elan mask)కు చెందిన అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ ప్రయోగ కేంద్రం నుంచి మంగళవారం అర్ధరాత్రి దీనిని ప్రయోగించారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శాటిలైట్( Sattlite)ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగం ప్రారంభించిన 34 నిమిషాల తర్వాత జీశాట్ 20 ఉపగ్రహాన్ని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ దురైరాజ్ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన జీశాట్ 20 ఖచ్చితమైన కక్షలోకి చేరినట్టు వెల్లడించారు. కర్ణాటకలోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ శాటిలైట్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నట్టు చెప్పారు. జీశాట్ 20ని భూకక్షలో ఉంచిన వీడియోను స్పేస్ ఎక్స్ కూడా రిలీజ్ చేసింది. జీశాట్ 20 ఉపగ్రహం దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత మెరుగుపరుస్తుందని ఇస్రో శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. శాటిలైట్‌లో అన్ని వ్యవస్థలు ఆశించిన విధంగా పనిచేస్తు్న్నాయని ఇస్రో తెలిపింది.
కాగా, హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జీశాట్-20ని ఇస్రో రూపొందించింది. దీనిని జీశాట్-2 అని కూడా పిలుస్తారు. కనెక్టివిటీ బలహీనంగా ఉన్న ప్రాంతాలకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చనుంది. ఈ ఉపగ్రహం బరువు 4700 కిలోలు ఉండగా ఇది 14 ఏళ్ల పాటు చురుకుగా ఉండునున్నట్టు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద ఉన్న అత్యంత శక్తి వంతమైన ఎల్‌వీఎం-3 రాకెట్ కేవలం నాలుగు వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే అంతరిక్షంలోకి పంపగలదు. అందుకే జీ శాట్ 20ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంది.
Read More...