Rarest blooming flowers : పుష్ప విరాజితం..! భూమిపై అరుదుగా వికసించే అందమైన పుష్పాలివే..

by Javid Pasha |
Rarest blooming flowers : పుష్ప విరాజితం..! భూమిపై అరుదుగా వికసించే అందమైన పుష్పాలివే..
X

దిశ, ఫీచర్స్ : ఈ అందమైన ప్రకృతిలో అంతు పట్టని రహస్యాలే కాదు.. ఆకర్షణీయమైన అద్భుతాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంటాయి. మరికొన్ని వినసొంపుగానూ, కను విందుగానూ ఉంటూ క్యూరియాసిటీని పెంచేస్తుంటాయి. ఇక అవి ఎల్లప్పుడూ అందుబాటులో లేని విషయాలో, అరుదైన సందర్భాలో అయితే మరింత ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో అరుదుగా మాత్రమే పుష్పించే మొక్కలు, వికసించే పువ్వులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో దశాబ్దాలకు ఒకసారి గంటల వ్యవధిలో మాత్రమే వికసిస్తాయి. అలాంటి అరుదైన పుష్పాల గురించి తెలుసుకుందాం.

బ్రహ్మ కమలం..

బ్రహ్మ కమలం.. హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే బ్రహ్మకమలం మొక్క ఏడాదికోసారి మాత్రమే పూస్తుంది. వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఆగష్టు నుంచి సెప్టెంబర్ మధ్య వరకు దీని పువ్వులు పూస్తాయి. అయితే మొగ్గ తొడిగిన తర్వాత రెండు మూడు వారాలకు మాత్రమే ఈ పువ్వులు వికసిస్తాయి. అది కూడా రాత్రిపూట మాత్రమే వికసించి పరిమళాలు వెదజల్లుతాయి. కొందరు ఇళ్లల్లోనూ దీనిని పెంచుతుంటారు. ఒకవేళ అది సరిగ్గా పెరగడం లేదంటే సూర్యరశ్మి సరిగ్గా అందడం లేదని అర్థం. ఎందుకంటే దీనికి ఇది చాలా ముఖ్యం. బ్రహ్మ కమలం వికసించడాన్ని కొందరు శుభ సూచకంగా భావిస్తారు. తమ ఇంటిలో పెంచిన బ్రహ్మకమలం మొక్కకు సంబంధించిన పువ్వు వికసించినప్పుడు చూస్తే తమ కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు.

నీల్ కురింజి ఫ్లవర్

స్ట్రోబిలాంథెస్ కుంతియానా (Strobilanthes kunthiana), కురింజి లేదా నీల కురింజి పువ్వులు కూడా 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. ఇవి భారత దేశంలోని దక్షిణ భాగంలో ఎత్తైన ప్రదేశాలలో, పర్వత ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే వైల్డ్ ఫ్లవర్ రకం.

ఫైర్ లిల్లీ

గ్లోరియోసా సూపర్బా (Gloriosa superba)ను వాటి అద్భుతమైన అగ్ని జ్వాలల్లాంటి పువ్వులను కలిగి ఉండటంవల్ల ఫైర్ లిల్లీస్ అని పిలుస్తారు. ఇవి ఆసియా, దక్షిణాఫ్రికాలోని ఉష్ణ మండల ప్రాంతాలకు చెందినవి. అయితే ఏడాదికోసారి పూసే ఈ పువ్వులను తాక కూడదు. ఇవి విషపూరితమైనవి.

హాట్ లిప్స్

ఈ శక్తివంతమైన పాలికోరియా ఎలాటా దాని రెండు విలాసవంతమైన ఎర్రటి కవచాలా కారణంగా హాట్ లిప్స్ అని పిలువబడుతోంది. మధ్య, దక్షణ అమెరికాలోని వర్షారణ్యాలకు స్థానికంగా, అటవీ నిర్మూలన కారణంగా ఇది అంతరించిపోతున్నట్లు పరిగణించబడుతోంది.

లేడీస్ స్లిప్పర్ ఆర్చిడ్

ఈ పువ్వుకు లేడీస్ స్లిప్పర్(Lady’s slipper orchid)తో పోలిక ఉన్నందున దానికా ఆ పేరు వచ్చింది. ఇది పెరగడానికి, పరిపక్వం చెందడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది చట్టం ప్రకారం రక్షిత జాతి పుష్పం. దీనిని ముట్టుకోవడం, తెంపడం చట్టవిరుద్ధం.

ఘోస్ట్ ప్లాంట్

మోనోట్రోపా యూనిఫ్లోరా, ఘోస్ట్ ప్లాంట్, దెయ్యం పైపు లేదా ఇండియన్ పైప్ (Indian pipe) అని కూడా పిలుస్తారు. ఇవి క్లోరోఫిల్‌ను ప్రొడ్యూస్ చేయనందున చాలా లేతగా కనిపిస్తుంది. ఆహారాన్ని తయారు చేయడానికి కిరణ జన్య సంయోగక్రియను ఉపయోగించడకుండా ఇది మైకోరైజల్ శిలీంధ్రాలపై ఆధారపడుతుంది. ఇది ఆసియా, ఉత్తర అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణ ప్రాంతాలకు చెందిది అరుదైన పువ్వు.

క్వీన్ ఆఫ్ ది నైట్

ఎపిఫిలమ్ ఆక్సిపెటలమ్ (Epiphyllum oxypetalum), క్వీన్ ఆఫ్ ది నైట్ లేదా డచ్‌ మాన్ పైప్ కాక్టస్ అని కూడా పిలువబడుతుంది. ఇదొక ఫేమస్ కాక్టస్ జాతి పుష్పం. చూడ్డానికి సాధారణంకంటే పెద్దగా కనిపించే ఈ స్వీట్ స్మెల్లింగ్ పుష్పాలు ఏడాదికోసారి రాత్రిపూట మాత్రమే కొన్ని గంటలపాటు వికసిస్తాయి. ఆ సమయంలో అందమైన సువాసనను వెదజల్లుతాయి.

చాక్లెట్ కాస్మోస్

చాక్లెట్ కాస్మోస్ అనే పువ్వు మెక్సికోకు చెందినది. కానీ ఇప్పుడిది ఉనికిలో లేదు. ఎక్కడో ఒకచోట ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఎరుపు - గోధుమ రంగులో ఉండే ఈ చాక్లెట్ కాస్మో పుష్పం. ఏటా వేసివి చివరిలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. అప్పుడు దీనినుంచి రిచ్ చాక్లెస్ వాసన వెదజల్లు తుంది. అందుకే దీనికా పేరు వచ్చింది.

శవం పువ్వు

శవం పువ్వు (corpse flower) లేదా టైటాన్ అరమ్ (titan arum) అనే పేరుగల ఈ పుష్పం కొన్ని దశాబ్దాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. చాలా అరుదైన ఈ పువ్వు 11. 8 అడుగుల (3.6 మీ) ఎత్తు వరకు పెరుగుతుంది. విషయం ఏంటంటే.. దీనికి మూలాలు లేవు. ఒక కాండం మాత్రమే శంఖం ఆకారంలో ఉంటుంది. ఈగలు, అలాగే క్యారియన్ బీటిల్స్ (flies and carrion)ను ఆకర్షించడానికి ఈ పుష్పం కుళ్లిపోయిన శవం లాంటి దుర్వాసననలు వెదజల్లుతుంది. కాబట్టి దీనికి శవం పువ్వు అనే పేరు వచ్చింది.

ఘోస్ట్ ఆర్చిడ్

ఘోస్ట్ ఆర్చిడ్ లేదా డెండ్రోఫిలాక్స్ లిండె అని కూడా పిలిచే ఈ అరుదైన పువ్వునకు దాని రేకుల ఆకారం కారణంగా ఈ పేరు వచ్చింది. ఎందుకంటే ఇది పెరగడానికి అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమ అవసరం (సాధారణంగా క్యూబా, ఫ్లోరిడా, బహమాస్ లలో పెరుగుతుంది). కాగా ఇది ఏప్రిల్, ఆగష్టు మధ్య మూడు వారాలపాటు మాత్రమే వికసిస్తుంది.

జూలియట్ రోజ్

జూలియట్ గులాబీ (Juliet rose) ప్రపంచంలోని అరుదైన పుష్పాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీని పెంపకం దారుడు డేవిడ్ ఆస్టిన్‌కు ఇంగ్లాండ్‌లో ఈ పుష్పాన్ని పండించడానికి 15 సంవత్సరాలు పట్టింది. అందుకోసం అతనికి 4.3 మిలయన్ల యూఎస్ డాలర్లు ఖర్చయ్యాయి. ఈ అందమైన గులాబీ పీచు నేరడు పండు రంగు రేకులను కలిగి ఉంటుంది.

క్వీన్ ఆఫ్ ది ఆండీస్

అండీస్ క్వీన్ అని పిలిచే ఈ పూలు ప్రధానంగా బోలీవియా, పెరూ దేశాల్లో సముద్ర మట్టానికి 10,500 నుంచి 15,750 అడుగుల (3,200 నుండి 4,800 మీ) ఎత్తులో ఆండీస్ పర్వత శ్రేణుల్లో కనిపిస్తాయి. ఇవి వందేళ్లకోసారి మాత్రమే వికసిస్తాయి. వాటి కఠినమైన వాతావరణం కారణంగా వికసించడానికి దశాబ్దాలు పడతాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అయితే ఇవి 8 నుంచి 12 మిలియన్ల విత్తనాలను, వేలాది పువ్వులను ఉత్పత్తి చేస్తాయి. అంతరించిపోతున్న పువ్వులు పుష్పించిన తర్వాత దాని మొక్క చనిపోతుంది.

నల్ల గబ్బిలం పువ్వు

బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ లేదా టక్కా చాంట్రియరి (tacca chantrieri). ఈ పువ్వు దాని రంగు కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పుష్పంగా ప్రసిద్ధి చెందింది. పొడవాటి మీసాల వంటి కేసరాలతో సహా, అచ్చదం గబ్బలాలా మాదిరి కనిపిస్తుంది. కాబట్టి దీనికా పేరు వచ్చింది. తేమ అధికంగా ఉండే ఆగ్నేసియాలో ఇది కనుగొనబడింది.

రోత్స్ చైల్డ్ స్లిప్పర్ ఆర్చిడ్

బ్లాక్ మార్కెట్‌లో వేల డార్ల విలువైన రోత్స్ చైల్డ్ స్లిప్పర్ ఆర్చిడ్ (Rothschild’s slipper orchid)ను పాఫియోపెడిలమ్ రోత్స్ చైల్డియానమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అరుదైన పువ్వులలో ఒకటిగా ప్రసిద్ధి. ఇది 1,640 అడుగుల (500 మీ) కంటే ఎక్కువ ఎత్తులో కినాబాలు పర్వత సమూహంలోని వర్షారణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. కానీ పుష్పించడానికి 15 సంవత్సరాలు పడుతుంది.

యూటన్ పోలూ..

చైనా, తైవాన్ దేశాలకు చెందిన ఈ చిన్న పరాన్నజీవి యూటన్ పోలూ పుష్పం మొదటిసారిగా ఆరాయిడ్ తాటి ఆకులపై పెరుగుతున్నట్లు నివేదించబడింది. దీని అరుదైన తెల్లని పువ్వులు ఒక మిల్లీమీటర్ కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉండవు. వాటికి శాస్త్రీయ నామం లేదు కానీ ప్రతీ 3 వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఇది బౌద్ధ మతంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

జాడే వైన్

స్ట్రాంగ్ లోడాన్ మాక్రోబోట్రీస్ లేదా జాడే వైన్ అనే పువ్వు, ఫిలిప్పీన్స్ ఉష్ణమండల అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పజాతి. పంజా వంటి ఆకారంలో ఉండే ఈ పచ్చ రంగు పుష్ప సమూహాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అటవీ నిర్మూలన కారణంగా అంతరించిపోతున్నాయి. ఇవి ఏడాదికోసారి మాత్రమే వికసిస్తాయి.

చిలుక ముక్కు పుష్పం

లోటస్ బెర్థెలోటి లేదా చిలుక ముక్కు పువ్వులు (Parrot’s beak ) చాలా అందంగా ఉంటాయి. ఇవి కానరీ దీవులకు చెందిన తీగలకు విరబూసే అరుదైన పుష్పాలు. వాటి పదునైన, ప్రకాశవంతమైన పసుపు, నారింజ రంగు పువ్వుల వాటి ఆకారాల కారణంగా వీటికి ప్యారట్ బీక్ (Parrot’s beak ) పుష్పాలు అనే పేరు వచ్చింది.

Advertisement

Next Story