Bank locker key: బ్యాంక్ లాకర్ కీ పోయిందా.. ఇలా చేయండి..?

by Anjali |
Bank locker key: బ్యాంక్ లాకర్ కీ పోయిందా.. ఇలా చేయండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమైన వస్తువులు, డాక్యుమెంట్ల(documents)ను సేఫ్‌గా ఉంచుకోవడానికి బ్యాంక్ లాకర్లు(Bank lockers) బాగా యూజ్ అవుతాయి. లాకర్ తీసుకున్నప్పుడు బ్యాంక్స్ కేవలం కస్టమర్‌(Customer)కు మాత్రమే యాక్సెస్ ఉండేలా కీ ఇస్తారు. కాగా ఎప్పుడైనా కీ కనిపించకపోతే.. లేదా పని ఒత్తిడి వల్ల ఎక్కడైనా పెట్టి మర్చిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

విలువైన వస్తువులన్నీ లాకర్‌లో ఉంటే ఏలాంటి భయం లేకుండా ఉంటారు. ఒక్కసారిగా ఆ కీ కనిపించకపోతే మాత్రం గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటి సందర్భంలో మీ దగ్గర్లో ఉన్న పోలీసు పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. మిస్ అయిన కీ కోసం ఎఫ్‌ఐఆర్(FIR) దాఖలు చేయండి. మీ లాకర్‌ను తిరిగి పొందడానికి బ్యాంకుకు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. మీ దగ్గరున్న డూప్లికేట్ కీ ఉంటే బ్యాంక్ మీ ఐడెంటిటీ(Identity)ని ధృవీకరించిన తర్వాత దాన్ని అందిస్తుంది.

డూప్లికేట్ కీ(Duplicate key) లేనట్లైతే.. బ్యాంక్ లాకర్‌ను పగలగొడుతుంది. తర్వాత విలువైన వస్తువులన్నీ వేరే లాకర్‌కు మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు మరో కొత్త కీ ఇస్తారు. కానీ లాకర్ బద్దలు కొట్టిన తర్వాత.. దాని రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం మీరే భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా బ్యాంక్ ప్రతినిధి అండ్ కస్టమర్(Representative and Customer) ఇద్దరి సమక్షంలో జరుగుతుంది.

జాయింట్ అకౌంట్(Joint Account) ఉన్న లాకర్లకు, అన్ని అకౌంట్ హోల్డర్లు(Account holders) ఉండాలి. ఒకవేళ బ్యాంకు లాకర్ ఉన్న కస్టమర్ అక్కడ లేకపోతే.. ఆయన తరపున వేరే వ్యక్తిని పంపించడానికి అవకాశం ఉంటుంది. కానీ మెయిన్ పర్సన్ ఎందుకు రాలేదో విషయాన్ని లెటర్(Letter) రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది.

ఎస్బీఐ బ్యాంకు(SBI Bank) విధానం ప్రకారం అయితే కస్టమర్ మూడు ఏళ్ల లాకర్ రెంట్ కట్టకపోతే.. బ్యాంక్ బకాయిలు వసూలు చేయడానికి లాకర్‌ను పగలగొట్టే హక్కు ఆ బ్యాంకులకు ఉంటుంది. అలాగే లాకర్ ఏడేళ్లుగా వాడకపోయినా.. అలాగే క్లోజ్ చేసి ఉంచినట్లైతే.. బ్యాంక్ దాన్ని తెరవవచ్చు. అలాగే క్రిమినల్ కేసుల(Criminal cases) లాంటి విషయంలో లాకర్‌లో ఆధారాలు ఉన్నాయని కాస్త డౌట్ వచ్చినా కూడా.. బ్యాంక్ ఆ లాకర్‌ను పగలగొట్టే రైట్స్ ఉంటాయి.

Advertisement

Next Story