- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kerala:భార్యపై, భర్త బంధువుల బాడీ షేమింగ్ క్రూరత్వమే.. కేరళ హైకోర్టు
దిశ, వెబ్ డెస్క్: భార్య(Wife)పై, భర్త బంధువులు(Husband's Relatives) బాడీ షేమింగ్(Body Shaming) చేయడం వైవాహిక క్రూరత్వం(Marital Cruelty) కిందికే వస్తుందని కేరళ హైకోర్టు(Kerala High Court) నిర్ధారించింది. తన భర్త, అతని తండ్రి తో పాటు భర్త సోదరుడి భార్య వేధిస్తున్నారని(Harassing) వైవాహిక క్రూరత్వంపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 498ఏ(Section 498A) కింద తనపై ప్రారంభించిన విచారణను రద్దు చేయాలని కోరుతూ సోదరుడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కీలక తీర్పును వెళువరించింది.
ఈ సందర్భంగా.. వైవాహిక క్రూరత్వాన్ని శిక్షించే భారతీయ శిక్షాస్మృతి(Indian Penal Code) (IPC)లోని సెక్షన్ 498A కింద భర్త, అతని కుటుంబ సభ్యులు భార్యను అవమానించడం ప్రాథమికంగా క్రూరత్వంగా పరిగణించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే బాడీ షేమింగ్ చర్యలు మహిళను ఆత్మహత్యకు పురికొల్పడానికి, తీవ్రంగా గాయపరిచే అవకాశం ఉన్న ఏదైనా ఉద్దేశపూర్వక ప్రవర్తనను అందించే ఐపీసీ సెక్షన్ 498 ఏ ద్వారా కవర్ చేయబడుతుందని జస్టిస్ ఎ బదరుద్దీన్(Justice A Badaruddin) అన్నారు. అంతేగాక స్త్రీ యొక్క ప్రాణానికి, అవయవాలకు లేదా ఆరోగ్యానికి మానసికంగా గానీ, శారీరకంగా గానీ ప్రమాదం చేకూర్చే అవకాశం ఉన్నందున ఇది క్రూరత్వమే అవుతుందని న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు.