- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth Reddy: ఈ విషయం చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నా
దిశ, వెబ్‌డెస్క్: తనకు ముఖ్యమంత్రి సీటు కాంగ్రెస్(Congress) కార్యకర్తలు ఇచ్చిన గౌరవమని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. మంగళవారం హన్మకొండ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014-2018 మధ్య కేసీఆర్(KCR) కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో ఇద్దరు వరంగల్ మహిళలకు మంత్రులుగా స్థానం కల్పించామని అన్నారు. తమది మహిళల రాజ్యమని గర్వంగా చెబుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్(BRS) కనీసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటైనా నగరంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ అభివృద్ధి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) నిద్రపోకుండా కష్టపడుతున్నారని కొనియాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఎంతో పట్టుదలగా ఉన్నారని అన్నారు. మహారాష్ట్రలో అనేక ఎయిర్‌పోర్టులు ఉన్నాయని.. కానీ తెలంగాణలో మాత్రం ఒక్కటే ఎయిర్‌పోర్టు ఉందని అన్నారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తలపెట్టగానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డు వచ్చినా చేపట్టిన అభివృద్ధి పనులు ఆపబోం అని ప్రకటించారు. మొత్తం తెలంగాణలో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.