Weight loss: మెంతులను ఇలా తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గుతారు!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-19 14:29:01.0  )
Weight loss: మెంతులను ఇలా తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గుతారు!
X

దిశ, ఫీచర్స్: వంటగదిలో ఉండే ఒక అద్భుత ఔషధం మెంతులు. ఇందులో అనేక రకాల పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతుల్లో విటమిన్-ఏ, సీ, కే, బీ6, పొటాషియం ఫోలిక్, యాసిడ్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీర బరువు సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరిచేందుకు మెంతులు సహాయపడతాయి. ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెడతాయి. మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. ఇవే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకు మెంతులు సహాయపడతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ఈ మెంతులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకుంటే క్యాలరీలు బర్న్ అవుతాయి. మెంతులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఈజీగా శరీర బరువును తగ్గిస్తుంది. రాత్రంతా మెంతులను నానబెట్టి, ఉదయాన్నె పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్పూన్ మెంతులను వేడి నీటిలో బాగా మరిగించాలి. మెంతుల సారమంతా నీటిలో దిగే వరకు ఉంచి, గోరు వెచ్చగా చేసుకొని ఆ నీటిని తాగాలి.

మెంతులను మొలకెత్తేలా చేసి కూడా తినవచ్చు. ఇలా తీసుకుంటే అందులోని మరింత పోషకాలు శరీరానికి అందుతాయి. వీటిని నేరుగా లేదా సలాడ్‌లలో అయినా కలుపుకొని తినవచ్చు. ఇలా తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇలా తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే, మెంతుల పొడిలో ఓ స్పూన్ తేనె కలిపి, ప్రతీ రోజు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుందని వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడిని పెంచుతాయి.

Read More...

చలికాలంలో హెల్తీగా ఉండాలా..? ఈ పండ్లు తింటే బెటర్








Advertisement

Next Story

Most Viewed