- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిర్యాలగూడ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ
దిశ, మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధీరావత్ రవినాయక్ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..దామరచర్ల గిరిజన పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఇప్పటికి కేవలం 10% పనులు కూడా పూర్తి కాలేదని లేఖ లో పేర్కొన్నట్టు తెలిపారు. నార్కెట్పల్లి టు అద్దంకి హైవే ప్రక్కన కనీసం ప్రహారీ గోడ లేనటువంటి అద్దె భవనములో వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు కనీసం తరగతి గదులు సరిపడ లేకపోవడంతో పాటు..సరైన స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ సంకల్పం గాడి తప్పే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భవన నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట ధనావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు ఉన్నారు.