- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Surekha : హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి చేస్తాం.. సభలో మంత్రి కొండా సురేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ స్థాయిలో వరంగల్‌ను అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో ఆమె ప్రసంగించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని తెలిపారు. అందులో అభిమానించే సీఎంలు దివంగత నేత వైఎస్ఆర్ (YSR) అని, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (CM Revan Reddy) అని కొనియాడారు.
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ మాజీ కేసీఆర్ (KCR) దగ్గర పని చేసినట్లు గుర్తుకు చేశారు. ఆయన వరంగల్‌కు ఎన్నో హామీలు గుప్పించారు కానీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని మంత్రి విమర్శించారు. (Warangal) వరంగల్‌ను మంచి నగరంగా అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎప్పుడూ చెప్తుంటారని అన్నారు. ఒక్క రోజులోనే వరంగల్‌కు దాదాపు రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. వరంగల్ ప్రజల చిరకాల కోరిక విమానాశ్రయం కూడా త్వరలో సాకారం కానుందని తెలిపారు.