ఫైన్ రసీదు తీసుకుంటూ మహిశ మృతి..

by Sumithra |
ఫైన్ రసీదు తీసుకుంటూ మహిశ మృతి..
X

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపల్ కమిషనర్ వేసిన ఫైనల్ రిసిప్ట్ తీసుకుంటూ గుండెపోటుతో కూరగాయల బాలమ్మ (65) మృతి చెందింది. ఈ సంఘటన మక్తల్ లో మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే మున్సిపాలిటీ పరిధిలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న బాలమ్మ కూరగాయల వ్యర్థాలను రోడ్డు పై పారేసి నందుకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిస్తు 200 పైన్ వేశారు.

మళ్లీ ఇలా చేస్తే 5000 లేదా 10,000 రూపాయలు ఫైన్ వేస్తూ రసీదు తీసుకుంటూ బాలమ్మ నిలబడిన స్థలంలో హటాత్తుగా కుప్పకూలి పడిపోయింది. దీంతో హుటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్ళి పరీక్షించగా గుండె పోటు లక్షణాలని సీపీఆర్ చికిత్స అందించినా తుది శ్వాస విడిచిందని డాక్టర్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బెదిరించినందుకే భయపడి గుండె పోటుతో తమ తల్లి చనిపోయిందని, అందుకు మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story