జీవో 317, జీవో 46పై కొత్త వెబ్‌పోర్టల్ ఏర్పాటు

by Anjali |
జీవో 317, జీవో 46పై కొత్త వెబ్‌పోర్టల్ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జీవో 317, 46 బాధితులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇక జీఓను రద్దు చేయాలంటూ కొంతమంది ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ అవ్వడం రాష్ట్ర పాలిటిక్స్‌లో సంచలనం రేపింది. తాజాగా పోర్టల్ ఏర్పాటు చేయడంతో ముందడుగు పడినట్లయింది.

Advertisement

Next Story