Congress MLA: వాళ్లంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులే

by Gantepaka Srikanth |
Congress MLA: వాళ్లంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులే
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పైన బీఆర్ఎస్(BRS) నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకులాల మీద కావాలనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీచానికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 శాతం డైట్ ఛార్జీలు పెంచి మంచి భోజనం అందిస్తుంటే ఓర్వలేక ఫుడ్ పాయిజన్ అంటూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ఎంత దుష్పచారం చేసినా ప్రజలకు నిజాలు తెలుసని అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి కనీసం డైట్ ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు కనిపించడం లేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed