- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Congress: సోనియా గాంధీ బర్త్ డే స్పెషల్.. తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) పుట్టినరోజు సమీపిస్తోన్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మహిళా సంఘాలకు చీరలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా సంఘా(Mahila Sanghalu)ల్లోని సభ్యులకు రెండేసి చొప్పున చీరలు(sarees) ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. మహిళా సంఘాలకు రూ.5 వేల కోట్ల రుణం ఇచ్చేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ప్రియాంకా గాంధీ సైతం తన తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆమె బర్త్ డే రోజు నుంచే వయనాడ్‌లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. స్వయంగా సోనియాతో కలిసి వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్లా రాహుల్ గాంధీ గెలుపొందారు. దీంతో అనివార్యంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన వయనాడ్‌కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక రాగా, ఆ స్థానం నుంచి ప్రస్తుతం ప్రియాంకా గాంధీ బరిలోకి దిగారు.