Seethakka : రాష్ట్ర బడ్జెట్‌పై KCR కామెంట్స్.. సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

by Rajesh |
Seethakka : రాష్ట్ర బడ్జెట్‌పై KCR కామెంట్స్.. సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్‌లో మంత్రి మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని మినిస్టర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై నోరు మెదపని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ మెప్పుకోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారన్నారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే అందుకు నిదర్శనం అన్నారు.

Advertisement

Next Story