- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ద్వంసంపై స్పందించిన డిప్యూటీ సీఎం
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 13 ఆదివారం అర్దరాత్రి సమయంలో సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఆలయం నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు బయటకు వచ్చి.. పారిపోతున్న ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కాగా గుడి లో ప్రవేశించిన అన్యమతస్తుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని.. కింద పడేయడం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని.. గుడికి పక్కనే ఉన్న ఓ మసీదులో నుంచి వచ్చిన దుండగులే ఈ దాడి చేశారని ఆరోపిస్తూ.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాగా ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు."సికింద్రబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని, ఇది చాలా దుర్మార్గమని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను అన్ని మతాల వారు సామాజికంగా కాపాడుకోవాలని సూచించారు. అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏపీలో కూడా ఇలానే ఆలయాలను అపవిత్రం చేశారని.. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు అవసరమని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.