School Holiday: ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

by Shiva |   ( Updated:2024-09-03 15:29:25.0  )
School Holiday: ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే ఇవాళ కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీలోని గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కలెక్టర్లు నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంపై ఆ జిల్లా కలెక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్ష ప్రభావం ఉన్న కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని స్కూళ్లకు, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

Advertisement

Next Story