'MP లక్ష్మణ్ ఇచ్చిన స్టేట్మెంట్ BJP నిర్ణయమా? లక్ష్మణ్ నిర్ణయమా?'

by GSrikanth |
MP లక్ష్మణ్ ఇచ్చిన స్టేట్మెంట్ BJP నిర్ణయమా? లక్ష్మణ్ నిర్ణయమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసి ఎస్సీ, ఎస్టీల నోరు కొట్టడంతో పాటు రిజర్వేషన్‌కే ఎసురు పెట్టే కుట్ర చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రాంచందర్ నాయక్ అన్నారు. గిరిజనుల, దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. మంగళవారం మాసబ్ ట్యాంకులోని జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బీజేపీ అడ్డుకుంటుందా అనేది ఆపార్టీ నాయకులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్‌కు అడ్డుపడాలని బీజేపీ చూస్తే తెలంగాణలో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఎంపీ లక్ష్మణ్ ఇచ్చిన స్టేట్మెంట్ పార్టీ నిర్ణయమా? లక్ష్మణ్ నిర్ణయమా? అని ప్రశ్నించారు. గిరిజనులు ఎదగడం బీజేపీ ఇష్టం లేదా? అన్నారు. గిరిజన రిజర్వేషన్ పెంపునకు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేదని, గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచొచ్చని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని బీజేపీ నాయకులు చదువుకోవాలని సూచించారు.

2017లో తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే దానిమీద నిర్ణయం తీసుకునే ధైర్యం లేని బీజేపీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటించగానే ఎందుకు ఉలిక్కిపడుతుందో స్పష్టం చేయాలన్నారు. 50శాతం రిజర్వేషన్ దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు గిరిజనులకు వర్తించదని లక్ష్మణ్ కు తెలియదా? అని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల కోసమే ఎస్టీల రిజర్వేషన్ గిరిజన బందు అన్ని చేపే బీజేపీ నాయకులు తెరాస కంటే గొప్ప పనులు ఏం చేశారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు బానోతు బాబురావు నాయక్, ఎన్. భాస్కర్ నాయక్, బిక్షనాయక్, నారాయణ నాయక్, భరవత్ శ్రీను నాయక్, రాంబాబు, ఆర్.కళ్యాణ్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story