- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రుణమాఫీ చేస్తాడు ఓకే.. కానీ ఏ సంవత్సరం ఆగష్టులో చేస్తాడో కనుక్కోండి’.. CM రేవంత్‌పై కేసీఆర్ సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ నియోజక వర్గానికి వెళ్లినా రేవంత్ రెడ్డి రుణమాఫీ ఆగస్ట్ 15లోపు చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు. కానీ తెలివిగా ఏ సంవత్సరం ఆగస్టు 15లోపు చేస్తా అని చెప్పట్లేదని కేసీఆర్ విమర్శలు చేశారు. తాను ఆగష్టు అన్న కదా వచ్చే సంవత్సరం ఆగష్టు అంటడు రేపు అని ఎద్దేవా చేశారు. ఈ అనుమానం నాకు రాలేదని అన్నారు. రైతు సంఘాలు నా దగ్గరకొచ్చి చిట్ చాట్ చేశారు. వారు అడిగిన ముచ్చట ఇది అన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడ్ని అయిన నాకన్నా రైతులే ఎక్కువగా అడ్వాన్స్ ఉన్నారని తెలిపారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగష్టు అంటుండు? ఏ ఆగస్టు సార్ మరీ అని నన్ను ప్రశ్నించారన్నారు. అరే బాబు నన్ను అడిగితే ఏం వస్తది మీరు ముఖ్యమంత్రిని అడగండ్రా’ అని చెప్పానని కేసీఆర్ వెల్లడించారు. ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మాత్రం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇంకెందరు రైతులు మరణించాల్సి వస్తుందో అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Read More..
బండి సంజయ్ కు మద్దతుగా సినీ హీరో!.. నా మిత్రుడ్ని గెలిపించాలని వీడియో విడుదల