- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sajjanar: పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా..? వీసీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: తల్లిదండ్రులు ప్రమాదకర రీతిలో పిల్లలను బైక్ పై తీసుకెళుతున్నారని, వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం అవసరమా అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉండే ఆయన ట్రాఫిక్ నిబంధనలపై, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు నిరంతరం అవగహాన కల్పించేలా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వ్యక్తి స్కూటీపై ముందు బాగంలో ఓ పాపను, వెనుక నలుగురు పిల్లలను ఎక్కించుకొని ట్రాఫిక్ లో వెళుతున్నాడు. ఈ ఫోటోపై ఆయన స్పందిస్తూ.. పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా!? అని ప్రశ్నించారు. అలాగే పిల్లలకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాల్సింది పోయి.. ప్రమాదకర రీతిలో వారిని ఇలాబైక్పై తీసుకెళ్లడం బాధాకరమని అన్నారు. ఇలాంటి డేంజర్ ప్రయాణాలను ప్రోత్సహిస్తూ.. పిల్లలకు ఏం నేర్పిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. అంతేగాక రన్నింగ్ లో చిన్న ప్రమాదం జరిగిన వారి ప్రాణాలకే ప్రమాదమనే విషయం మీకు తెలియదా!? అని ఎక్స్ లో రాసుకొచ్చారు.