- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్టీఐను అస్త్రంగా చేసుకున్న రాష్ట్ర టీం.. పోరుబాటకే బీజేపీ నిర్ణయం..
దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఇరిగేషన్, పోలీసు శాఖలు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన బీజేపీ పోరు బాటను, లీగల్ దారిని ఎంచుకోవాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్ట్ లో అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరిగినందునే రాష్ట్ర అధికారులు అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే అనేక అంశాలపై ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న బండి సంజయ్‌కు తోడు ఇప్పుడు అనుమతిని నిరాకరించడానికి కారణాలను మనోహర్ రెడ్డి ఆ చట్టం ద్వారానే తెప్పించుకోవాలనుకుంటున్నారు. అనుమతి నిరాకరించిన విషయంలో మూడు ప్రశ్నలను ప్రధాన కార్యదర్శికి ఆర్టీఐ ద్వారా సోమవారం దరఖాస్తు చేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్ మొదటి వారంలో సందర్శించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా బండి సంజయ్ విజ్ఞప్తి చేశారా, దానికి ప్రభుత్వ స్పందన ఏమిటి..? ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, పూర్తి సమాచారాన్ని, ఉత్తరప్రత్యుత్తరాలను ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను మనోహర్ రెడ్డి కోరారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సహా ఆయనతో పాటు వచ్చే టీమ్‌కు అనుమతి ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులేంటి, నిరాకరించడానికి కారణాలేంటి తదితరాలను కూడా తెలియజేయాల్సిందిగా ఆ లేఖలో కోరారు.
Also Read : హాట్ టాపిక్‌గా మారిన కేసీఆర్ బిహార్ టూర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!