రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు.. రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-04-28 07:40:40.0  )
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు..  రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో మాపై(ఆర్ఎస్ఎస్) తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వరుసగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు మోడీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని అందుకోసమే 400 ఎంపీ సీట్లను బీజేపీ అడుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. స్వార్థంతో ఆర్ఎస్ఎస్పై మాట్లాడుతున్నారని, ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. వివాదం సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం అని ఎవరికోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారు అభివృద్ధి చెందేవరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అన్నారు.

Advertisement

Next Story

Most Viewed