TRS ప్రభుత్వం చేతకాని తనం వల్లే 'పోడు' ఘర్షణలు : RSP

by Nagaya |   ( Updated:2022-11-23 12:53:37.0  )
TRS ప్రభుత్వం చేతకాని తనం వల్లే పోడు ఘర్షణలు : RSP
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు హత్యను తెలంగాణ బీఎస్పీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు హత్యకు గురికావడం దారుణం అన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రావు కుటుంబానికి ఆర్ఎస్పీ ప్రగాడ సానుభూతి తెలిపారు. అయితే, పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల చాలా ప్రాంతాల్లో గిరిజనులకు, అధికారులకు ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే శ్రీనివాస్ రావుకు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణలో అధికారి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని తెలంగాణ బీఎస్పీ డిమాండ్ చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Read more:

KCR ను చిక్కుల్లోకి నెడుతున్న TRS ఎమ్మెల్యేలు!

Advertisement

Next Story