- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సబ్సిడీ బియ్యానికి రూ . 2 వేల కోట్లు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చేందుకు ముందడుగు వేసింది. ఈ స్కీం అమలు చేసేందుకు ప్రభుత్వం రూ . 2 వేల కోట్లను కేటాయించింది. 2024 -25 ఏడాదికి సబ్సిడీ కింద ఆర్థిక శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది . ఇందుకు కావాల్సిన నిధులను విడుదల చేస్తూ ఆ ప్రిన్సిపాల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాదికి నిధులను వినియోగించనున్నారు. సన్న బియ్యం పంపిణీలో జాప్యం జరగకుండా ఈ స్కీం ను పకడ్బందీగా అమలుకు కావాల్సిన నిధులను ముందుగానే సమకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రేషన్ షాపుల ద్వారా దారిద్య రేఖకు దిగువన వున్న ప్రజానీకానికి రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యానికి అందిస్తామని, హామీ ఇచ్చింది . ఈ మేరకు అందుకు కావాల్సిన నిధులకు పరిపాలన అనుమతి లభించడంతో పేదలకు సన్నబియ్యం అందించడానికి లైన్ క్లియర్ అయింది .