- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Road Accedent; ఔటర్ రింగ్ రోడ్డు పైనుండి పడిపోయిన లారీ.. డ్రైవర్ మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి వెళుతున్న లారీ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. పెద్దఅంబర్ పేట్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్కేసర్ నుండి పెద్దఅంబర్ పేట్ వైపు వస్తున్న లారీ అకస్మాత్తుగా ఔటర్ రింగురోడ్డు పై నుండి సర్వీస్ రోడ్డులో పడిపోయింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా ధ్వంసం కాగా.. డ్రైవర్ తీవ్ర గాయల పాలయ్యాడు. తెల్లవారుజాము సమయం కావడంతో సర్వీస్ రోడ్లో ఎవరు ప్రయాణించడం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కింద పడ్డ లారీని గమనించిన స్థానికులు అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమేనని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన లారీ డ్రైవర్ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.