మండుతున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

by sudharani |
మండుతున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి నెలకరు నుంచే ఎండలు అత్యధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. నేటి నుంచి 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో 40-43 డిగ్రీలు, GHMC లో మాత్రం 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా వడదెబ్బకు ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story