హాట్​టాపిక్‌గా మారిన రేవంత్ వ్యాఖ్యలు.. స్వరం మార్చిన అధికార పార్టీ

by Vinod kumar |
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్నాళ్లు కాంగ్రెస్​ పార్టీని లైట్​తీసుకున్న బీఆర్ఎస్.. రేవంత్ వ్యాఖ్యలు తర్వాత ఒక్కసారిగా ఆ పార్టీపై ఎదురు దాడికి దిగింది. అకస్మికంగా స్వరం పెంచి కాంగ్రెస్​పై విమర్శలు చేయడం మొదలు పెట్టినది. హాథ్​సేహాథ్​జోడో యాత్రలో ఉన్న రేవంత్​ తన పర్యటన స్పీచ్​లో' ప్రగతి భవన్​ ను నక్సలైట్లు పేల్చేయాలి' అంటూ రెండు రోజుల క్రితం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య ఫైట్ కు కారణమయ్యాయి. దీంతో బీఆర్ఎస్​ ముఖ్య నేతలు పోలీసులకు కంప్లైంట్ చేయడమే కాకుండా, ఏకంగా ఇద్దరు మంత్రులు ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మరీ రేవంత్ పై ఎదురుదాడికి దిగారు.

ఉమ్మడి వరంగల్​జిల్లాలో పలుచోట్ల రేవంత్ దిష్టి బొమ్మను తగల పెట్టడం గమనార్హం.ముఖ్యమంత్రి అధికారిక భవనం పై అసాంఘిక పదాలు వాడటం సరైంది కాదని బీఆర్​ఎస్​నేతలు మండిపడ్డారు. ములుగులో పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రజల నుంచి స్పందన లేకనే ఇలా విచిత్రంగా వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్​పార్టీ నిర్ణయామా..? రేవంత్ వ్యక్తి గతమా..? క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదంటూ కాంగ్రెస్​ సీనియర్లకు బీఆర్ఎస్​ సూచించడం గమనార్హం.

అదే స్థాయిలో కాంగ్రెస్​ ఫైర్..

బీఆర్ఎస్​ విమర్శలు పై కాంగ్రెస్​పార్టీ కూడా అలెర్ట్ అయింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీపీసీసీ సీనియర్​స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గాంధీ భవన్​లో ప్రెస్​మీట్​ను ఏర్పాటు చేసి సీరియస్ అయ్యారు. ప్రజాధనంతో కట్టిన ముఖ్యమంత్రి అధికారిక భవనంలోకి ఎంట్రీ లేకపోవడం ఏంటని..? ప్రశ్నించారు. మిగతా కాంగ్రెస్​నేతలు కూడా అన్ని జిల్లాల్లో రేవంత్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. దీంతో ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరోకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. రేవంత్ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు బుధవారం కూడా ఓ ప్రెస్​నోట్ ను రిలీజ్ చేశారు.

వ్యూహం ప్రకారమేనా..?

గత కొన్నాళ్ల నుంచి బీఆర్​ఎస్, బీజేపీ ల మధ్యే అధికంగా రాజకీయ ఫైట్ లు ​కొనసాగుతూ వస్తుంది. బీఆర్​ఎస్​కూడా కాంగ్రెస్​పార్టీ ప్రస్తావన తీయకుండా బీజేపీ పైనే ఎక్కువ విమర్శలు చేసేది. తమకు ప్రధాన పోటీ బీజేపీ అనే స్టేజ్​కు బీఆర్ఎస్​గతంలో వ్యవహరించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ కూడా తన అవకాశాన్ని నిరూపించుకున్నది. దీంతో బీజేపీ రాష్ట్రమంతటా పాగా వేయాలని ప్లాన్​చేస్తూ ముందుకు సాగుతున్నది. ఒకానొక దశలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అన్నట్టుగా పొలిటికల్​యాక్టివిటీస్​జరిగాయి.

దీంతో తమకు నష్టం చేకూర్చేలా ఉన్నదని బీఆర్ఎస్​అలెర్ట్ అయింది. క్రమంగా బీజేపీ పార్టీ ప్రాధాన్యతను తగ్గించాలని నిర్ణయించుకున్న బీఆర్​ఎస్, తమకు కాంగ్రెస్​తోనే పోటీ ఉంటుందనే సంకేతాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నించింది. మంత్రి హరీష్​రావు కూడా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ ​పార్టీకి మాత్రమే అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు ఉన్నారని, తమకు కాంగ్రెస్​తోనే పోటీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న హాథ్​ సే హాథ్ ద్వారా కాంగ్రెస్​ పార్టీని జనాల్లోకి బాగా తీసుకువెళ్లాలని రేవంత్​ప్రయత్నాలు చేస్తున్నాడు.

దీనిలో భాగంగానే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. అత్యధిక కాంట్రవర్సీ గా ఉండే సబ్జెక్ట్​లను ప్రస్తావించడం వలన జనాల్లోకి ఎప్పటికీ కాంగ్రెస్ గురించి చర్చ కొనసాగుతుందని ఆ పార్టీ విశ్వాసం. దీంతోనే రేవంత్ అలా వ్యవహరించి ఉంటాడని సీనియర్​ కాంగ్రెస్​నేతల్లో ఒకరు ' దిశ' కు తెలిపారు. ఈ యాత్ర పూర్తయ్యే వరకు ప్రభుత్వం పై ఇలాంటి విమర్శలు ఇంకెన్నో ఉన్నాయని ఆయన చెప్పడం ఆశ్చర్యకరం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రస్తుతం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య రాజకీయ ఫైర్ లు మొదలు కావడం విశేషం. ఇది ఏ పార్టీకి లాభం, నష్టాలను తీసుకువస్తుందనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed