రేవంత్ గారూ.. ఆ ట్రీట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు.. : కేటీఆర్

by Rajesh |
రేవంత్ గారూ.. ఆ ట్రీట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు.. : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి బొగ్గు గనుల వేలం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తీరును ట్విట్టర్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్ గారూ.. పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా 2021లో మీరు బొగ్గు గనుల బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బొగ్గు బ్లాకులను సింగరేణి కాలరీస్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు సీఎంగా, తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరుత్సాహపరుస్తూ డిప్యూటీ సీఎంను వేలంలో పాల్గొనడానికి పంపారు. ఈ సడెన్ మార్పునకు దారితీసిన కారణాలను వివరిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో సింగరేణిని చివరికి ప్రైవేటీకరించేందుకు మార్గం సుగుమం అవుతుందని భావించారా అని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం గుజరాత్, ఒరిస్సాలోని పీఎస్‌యూలకు గనుల (వేలం నుంచి మినహాయింపు) ప్రత్యక్ష కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సేమ్ ట్రీట్‌మెంట్ తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని క్వశ్చన్ చేశారు.

Advertisement

Next Story