KTR ట్వీట్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-19 06:52:50.0  )
KTR ట్వీట్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించి కౌంటర్ ట్వీట్ వేశారు. ‘నిస్సిగ్గు మాటలు.. ఎదురుదాడులు.. కేరాఫ్ అడ్రస్ డ్రామారావు, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ - కేడీ, కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ - కేడీ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు’ అని పేర్కొన్నారు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed