BREAKING: రైతులకు రేవంత్ సర్కార్ మరో భారీ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్‌పై కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-05-20 14:27:22.0  )
BREAKING: రైతులకు రేవంత్ సర్కార్ మరో భారీ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్‌పై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి తీవ్ర ఆందోళన చెందుతోన్న రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం జరిగింది. సచివాలయంలో సోమవారం సమావేశమైన మంత్రి మండలి.. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యతను కలెక్టర్లకు అప్పగించి.. ధాన్యం చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సన్న వడ్లకు కింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. రేపట్నునుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. వచ్చే సీజన్ నుండి సన్నవడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా రాష్ట్రంలోని స్కూళ్ల నిర్వహణ చేపడతామని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.

Advertisement

Next Story