- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రస్తావించిన రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ‘2019లో మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలనేదే గద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష. దాన్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న చెప్పారు. అంతేకాదు యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని తనకు గద్దర్ సూచించారు.’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారని గుర్తుచేసుకున్నారు. లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పనిచేస్తామని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఇక 2011లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్న కిషన్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి కోట్లు పరువు నష్టం ఇచ్చి ఏమైనా అనొచ్చా? అంటూ రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. డ్రగ్స్ కేసుతో రకుల్ ప్రీత్ సింగ్‌తో సంబంధం లేకుంటే కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చినట్లు? అని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్హైజ్, అవుటర్రింగ్ రోడ్డుపై ప్రశ్నించినందుకే కేటీఆర్ ప్రస్టేషన్‌లో ఉన్నాడన్నారు.