గవర్నర్, KCR ఇద్దరూ క్షమాపణలు చెప్పాలి:Revanth Reddy

by GSrikanth |   ( Updated:2023-01-26 10:13:28.0  )
గవర్నర్, KCR ఇద్దరూ క్షమాపణలు చెప్పాలి:Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రగతి భవన్, రాజ్ భవన్‌కు పరిమితం చేయడం ద్వారా కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమాన పరిచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు ఉంటే మరో వేదికపై ప్రదర్శించాలి కానీ ఇద్దరి మధ్య విభేదాలకు రిపబ్లిక్ డేను వేదికగా మార్చుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో గవర్నర్, సీఎం కేసీఆర్ ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురవారం గాంధీ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుగల సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయడంతో పాటు అవసరం అయితే అలాంటి వారిని ఉరి తీసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు వర్తింపచేయాలని అన్నారు.

ఈ అంశంలో రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచన చేయాలన్నారు. ఇవాళ హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించినా ఫిబ్రవరి 6 నుంచి ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేసారు. 60 రోజుల పాటు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరుగుతానన్నారు. జనవరి 30న రాహుల్ గాంధీ కాశ్మీర్ లో జాతీయ జెండా ఆవిష్కరించి దేశ సార్వభౌమత్వాన్ని చాటుతారని అదే రోజు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రిజర్వేషన్లను పేదవారికి దూరం చేసే కట్ దేశంలో జరుగుతోందని ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Also Read....

గవర్నర్ తమిళిసై పై పోచారం ఫైర్

ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి బీఆర్ అంబేద్కర్ కారకుడు : ఎమ్మెల్యే రఘునందన్ రావు

Advertisement

Next Story

Most Viewed