- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : మత్స్యకారుల జీవితాల్లో మట్టికొట్టిన రేవంత్ సర్కార్ : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ మత్స్యకారుల(fishermen) జీవితాల్లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ మట్టికొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ లో చేప కథ ముగిసిన అధ్యాయమేనా? నడుమంత్రపు పాలనలో నెర్రలు భారిన నీలి విప్లవం అని ఆవేదన చెందారు. 20 వేల టన్నుల మత్య్ససంపద దిగుబడిపై కక్షగట్టిన ఇందిరమ్మ రాజ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండపోయాయని, మూసీ మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ.. జలాశయాల్లో జలపుష్పాలను వదలడంలో లేకపాయేనని విమర్శి్ంచారు.
మూసీ పేరుతో పేదల ఇల్లు కూల్చి రాక్షస ఆనందం పొందే నీకు(రేవంత్) ఉపాధి లేక బోసిపోయిన బెస్త వాడలపై ప్రేమ లేకపాయేనని దుయ్యబట్టారు. హైడ్రా పేరుతో హైద్రాబాద్ ఖ్యాతిని మంటగలుపుతున్న నీకు ముదిరాజ్ సోదరుల దీన స్థితిపై లేకపాయే నంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.