- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prabhas: జీవితాన్ని నాశనం చేసుకోకండి డార్లింగ్స్.. న్యూఇయర్ వేళ ప్రభాస్ స్పెషల్ వీడియో
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్(Drugs)పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. డ్రగ్స్ వలన జరిగే అనర్థాలను వీడియోలో వివరించారు. ‘లైఫ్‌లో మనకు బోలెడన్ని ఆనందాలు.. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే, మనకోసం బతికేవాళ్లు మనకున్నారు. అలాంటప్పుడు జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ మనకు అవసరమా? డార్లింగ్స్.. ఇక నుంచి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నో చెప్పండి. ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు కాల్ చేసి చెప్పండి. డ్రగ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ప్రభాస్ వీడియోలో చెప్పుకొచ్చారు.
మరోవైపు న్యూఇయర్ వేడుకల(New Year Celebrations) వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తెలంగాణ పోలీసులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పబ్బుల్లో, బార్లలో ఆకస్మిక తనిఖీలు చేసి ఓనర్లకు వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ వినియోగంపై తమకు సమాచారం వస్తే ఊచలు లెక్కించాల్సిందే అని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా.. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జరుపుకోండి అని సూచించారు. తప్పకుండా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. డ్రగ్స్ వాడకం మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా తక్షణమే సమాచారమివ్వాలని కోరారు.
మాదక ద్రవ్యాల సరఫరా/ వినియోగం,జీవితాలకు హానికరం మరియు నేరం.
— GETUPSRINU (@getupsrinu3) December 31, 2024
Rebel Star #Prabhas Garu's message supporting the anti-drug awareness initiative.
Together, let's build a healthier and stronger society.#SayNoToDrugs
@TelanganaCMO@revanth_anumula… pic.twitter.com/5ZHFzztj6k